హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో కూడా విజయకు బీభత్సమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు విజయ్ బంధువు, మాస్టర్ సినిమా నిర్మాత అయిన బ్రిట్టో ఇల్లు,ఆఫీస్ లోఐటి దాడులు చేసింది. ఇల్లు,కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.ఐటీ అధికారులు చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే విజయ బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. చెన్నై లోని శ్రీ పేరంబదూరు లోని పలు సెల్ఫోన్ సంస్థలపై తాజాగా ఐటి అధికారులు దాడులు చేశారు. ఇక తాజాగా బుధవారం ఉదయం అడయార్ లోని జేవియర్ బ్రిట్టొ నివాసం, చెన్నై కార్యాలయంలో సోదాలు చేశారు. సెల్ ఫోన్ సంస్థల్లో జరిపిన సోదాల్లో లభించిన సమాచారంతోనే దాడులు జరిగినట్లు సమాచారం. విజయ్ బంధువు అయినా బ్రిట్టో..మాస్టర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయనకు పలువురు ట్రాన్స్ పోర్ట్ సంస్థలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని హార్బర్ ల ద్వారా అనేక దేశాలకు వివిధ ఉత్పత్తులను తరలిస్తున్నారు.