ఆకట్టుకుంటున్నహైవే సినిమా కాన్సెప్ట్ పోస్టర్స్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే పుష్పక విమానం ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన హీరో తాజాగా కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్ హైవే సినిమాలో నటిస్తున్నారు.ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన మానసా రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ టు వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అలాగే ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయామీఖేర్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు. ఈ క్రమంలోనే రిలీజ్ చేసిన నటీనటుల కాన్సెప్ట్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ.. ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథే ఈ హైవే సినిమా ఇది అనీ తెలిపారు.

Share.