జబర్దస్త్ లో ఈ మధ్యకాలంలో జోడీలు ఎక్కువయ్యాయని చెప్పాలి. ఇక అందులో భాగంగానే సుధీర్ – రష్మీ జోడి తర్వాత అంతేస్థాయిలో పాపులారిటీని అందుకున్న జోడి ఇమ్మాన్యుయేల్ – వర్ష.. ఈ జోడి కి కూడా మంచి పేరు వచ్చిందనే చెప్పాలి.. వీరిద్దరూ చేసిన స్కిట్ ల వల్ల ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షితులవడం తో పాటు ఒక పక్క పరోక్షంగా ప్రత్యక్షంగా జబర్దస్త్ షో కి మంచి పేరు రావడానికి కూడా కారణం అవుతున్నారు.. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఏ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసినా.. ఆ ఈవెంట్స్ సైతం సక్సెస్ అవుతుండటం గమనార్హం..
ఇక పోతే కొంత మంది నెటిజన్లు వర్ష పై నెగిటివ్ కామెంట్లు చేయడంతో ఆమె జబర్దస్త్ షోలో కన్నీరు కూడా పెట్టుకుంది.. కానీ రష్మీ ఇచ్చిన ధైర్యం వల్లే తను తిరిగి మళ్ళీ తన స్కిట్ లతో బిజీ అయిపోయింది.. ఇకపోతే ఇమ్మాన్యుయెల్ – వర్ష ఇద్దరూ ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ ప్రేక్షకులకు కనువిందు చేస్తూ ఉంటారు. ఇక తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో లో వీరిద్దరూ ఒకరి పై ఒకరు పంచులు వేసుకున్నారు. ఈ షోలో భాగంగానే నూకరాజు ఎంట్రీ ఇచ్చి వర్షా తో హగ్ తీసుకోవడం నా చివరి కోరిక అని చెబుతాడు.. అప్పుడు వర్ష వెంటనే తొక్కలో పకోడి గాడే హగ్ తీసుకున్నప్పుడు నీకు ఇవ్వడంలో ఏముందిలే తొక్క అంటూ నూకరాజు కు హగ్ ఇస్తుంది.. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.