టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు కుర్రకారులను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఇలియానా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోలతో సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ మొదట దేవదాసు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.. ఆ తర్వాత పోకిరి, మున్నా, జులాయి, జల్సా తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. అప్పట్లోనే ఒక్కో చిత్రానికి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా కూడా పాపులారిటీ సంపాదించింది ఇలియానా.
ఈ క్రేజ్ తోనే బాలీవుడ్లో బర్ఫీ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన ఈమెకు పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తిరిగి తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. తెలుగు తెరకు దూరమైన సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో ఎప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. గత కొన్ని నెలల క్రితం వివాహం కాకుండానే తలైంది ఇలియానా.. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.
ఇక ఆ తర్వాత బేబీ బంప్ ఫోటోలతో పాటు తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది. తాజాగా ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాకుండా తన కుమారుడికి పేరును కూడా పెట్టడంతో పాటు ఫోటోలను కూడా రివీల్ చేయడం జరిగింది. ఇలియానా కొడుకు పేరు “కోవా ఫినిక్స్ డోలస్”. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన తన కుమారుడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. తన కుమారుడు నిద్రపోతూ ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేయడం జరిగింది ఇలియానా.
View this post on Instagram