డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఉప్పెన.. ఈ సినిమాతో హీరోగా మెగా కుటుంబం నుంచి పరిచయమయ్యారు హీరో వైష్ణవ తేజ్. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది కృతి శెట్టి.. అంతకుముందు ఈ ముద్దుగుమ్మ కోన్ని కమర్షియల్ యాడ్ లలో మాత్రమే నటించింది. సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించినట్లు తెలుస్తోంది. ఒక కమర్షియల్ యాడ్ లో ఈమెను చూసిన డైరెక్టర్ బుచ్చిబాబు హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగిందట. ఉప్పెన సినిమాలో ఈమె అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. అంతేకాకుండా రొమాంటిక్ సాంగ్స్ సన్నివేశాలలో కూడా బాగా ఆకట్టుకుంది.
ఈమె ఎలాంటి పాత్రలోనైనా నటిస్తుంది కాబట్టి మంచి డిమాండ్ ఉంది.ఉప్పెన సినిమాతో అద్భుతమైన పాపులారిటీ సొంతం చేసుకున్న కృతి శెట్టి రెమ్యూనరేషన్ విషయంలో చాలా నష్టపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.ముందస్తు ప్రకారం.. కృతి శెట్టి కేవలం రూ.15 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి మరో రూ .10 లక్షలు ఆమె ఖర్చులకు ఇచ్చారట. అంటే ఆమెకు నెలకు రెండు లక్షలు చొప్పున రెమ్యూన రేషన్ మైత్రి మూవీ మేకర్స్ వారు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రెమ్యూనరేషన్ తక్కువగా వచ్చినా కూడా ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ రావడంతో ఈ సినిమా సక్సెస్ అవడంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ ప్రస్తుతం కోటికి పైగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక యంగ్ హీరోలతో ఈమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా ఇతర భాషలలో కూడా పలు అవకాశాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ ఆఫర్లు కూడా ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. అయితే కృతి శెట్టి మొదటి సినిమా రెమ్యూనరేషన్ తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.