తాజాగా మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో.. మరొకవైపు వ్యాపారంగంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఆయన తన భార్య నమ్రత పేరు మీద హైదరాబాదులో ఏఎన్ అనే ఒక రెస్టారెంట్ ను తాజాగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏషియన్ గ్రూప్ తో కలిసి డిసెంబర్ 8వ తేదీన హైదరాబాదులో రెస్టారెంట్ ప్రారంభించారు మహేష్ బాబు. ఈ రెస్టారెంట్ కి ఏ ఎన్ అనగా ఏషియన్ నమ్రత అని నామకరణం కూడా చేశారు. ఈ కొత్త రెస్టారెంట్ ప్రస్తుతం బంజారాహిల్స్ లోని టిఆర్ఎస్ భవనం పక్కన ఏర్పాటు చేయడం జరిగింది.
ఇకపోతే తాజాగా ప్రారంభించిన ఈ రెస్టారెంట్లో ఫుడ్ ధరలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే.. ఈరోజు గ్రాండ్ గా ఓపెన్ అయిన ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్ ధరలు తెలిస్తే నిజంగా సామాన్యులు ఈ రెస్టారెంట్లోకి అడుగు కూడా పెట్టలేరు.. ఆనియన్ రవ్వ దోశ రూ.205, పునుగులు ప్లేటు రూ.125 , ఉప్మా 120 రూపాయలు ,కాఫీ 90 రూపాయలు ఇలా ఉన్నాయి.
ఈ ధరలు చూసి ఈ రేంజ్ లో రేట్లు ఏంట్రా సామి అంటూ కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి కొంతమంది మాత్రం ఎక్కువ ధర ఏమీ కాదు .. రెస్టారెంట్ స్థాయిని బట్టి.. క్వాలిటీను బట్టి రేట్లు ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి అయితే ఏఎన్ రెస్టారెంట్ లో ఫుడ్ ఐటమ్ కి సంబంధించిన మెనూ ధరలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా ప్రారంభమైన రెస్టారెంట్ లోపల లుక్ మాత్రం చాలా అదిరిపోయింది. డిజైనింగ్ ఫర్నిచర్ సూపర్ అంటూ నేటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఫైవ్ స్టార్ హోటల్ లా ఉంది అని.. తప్పకుండా ఈ హోటల్ బిజినెస్ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు.
ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీలో నిలవబోతోంది . ఒకవైపు సినిమా రంగం.. మరొకవైపు బిజినెస్ అంటూ క్షణం తీరిక లేకుండా దూసుకుపోతున్నారు మహేష్ బాబు.