మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. ఒక్కోసారి కథల ఎంపిక విషయంలో పొరపాటు జరిగి సినిమా కాస్త నిరాశపరిచినా సరే రవితేజ పర్ఫామెన్స్ పరంగా ఎప్పుడు అభిమానులను నిరాశపరచలేదు. దాదాపు 60 సినిమాలకు పైగా చేసిన రవితేజ ఇప్పుడు టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోలలో ఒకడిగా చలామణి అవుతున్నారు. 50 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా దూసుకుపోతున్న రవితేజ తన ఫిట్నెస్ ను ఎంతలా కాపాడుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా మారి అభిమానులకు మరింత చేరువయ్యాడు.
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రవితేజ రాకెట్ లా దూసుకుపోతున్నారు. ఇకపోతే ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే. రవితేజ తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు.. తన స్టార్ ఇమేజ్ కారణంగా తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడతాడు. అందుకే రవితేజ భార్య, పిల్లలు ఎలా ఉంటారో కూడా ఎవరికి తెలియదు . ఆ మధ్య సోషల్ మీడియాలో రవితేజ భార్య, పిల్లల ఫోటోలను పోస్ట్ చేసే వరకు ఎవరికీ తెలియదు. ఇకపోతే ఆయన భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే.
రవితేజ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. 2002 మే 26న తన మేనమామ కూతురు కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో చాలా ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పూరి జగన్నాథ్ , కృష్ణవంశీ, శివాజీ రాజా తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే కళ్యాణి రవితేజకు చిన్నప్పటినుండి తెలిసిన అమ్మాయి. కళ్యాణి తండ్రి రవితేజ తల్లి రాజ్యలక్ష్మి కి సోదరుడు.. హీరోగా ఎదుగుతున్న రవితేజకు బయట అమ్మాయితో పెళ్లి చేయడం కంటే బంధువుల అమ్మాయి అయితే బాగుంటుందని భావించిన రవితేజ తల్లి .. తన మేనకోడలు కళ్యాణిని ఇంటి కోడలుగా చేసుకుందామని భావించి.. రవితేజను ఒప్పించి మరి వివాహం చేసింది. ఇక వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.