సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులను సైతం ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ మధ్యకాలంలో అడల్ట్ సినిమాల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నది. కొన్ని సినిమాలలో సంబంధం లేకపోయినా సరే రొమాంటిక్ సన్నివేశాలను క్రియేట్ చేస్తూ సినిమా హైపుని పెంచుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు.
ఈ మధ్యకాలంలో హీరోయిన్ల అందాలు ఎక్స్పోజ్ చేయడంతో పాటు లిప్ లాక్ సన్నివేశాలతో నడుము అందాలను చూపిస్తూ ఉండడం కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఇలాంటి సన్నివేశాలు లేకపోతే ఆ సినిమా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనే భావన దర్శకనిర్మాతల పడిపోయింది. ఇదే అవకాశంగా భావించుకొని హీరోయిన్లు కూడా రెచ్చిపోయి మరి సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇలాంటి సన్నివేశాలకి భారీ డిమాండ్ ఉందని చెప్పవచ్చు. కానీ ఎవరు ఈ విషయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడరు.
తాజాగా హీరోయిన్ రెజీనా మాత్రం ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. తమిళ మీడియాకు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజినా ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటేనే రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తారని అలాంటి సీన్లు చేసినప్పుడు హీరోయిన్లకు కూడా ఎక్కువ కావాలనిపిస్తుందని తెలియజేసింది. అందులో ఎలాంటి తప్పులేదు ఎందుకంటే అలాంటి సీన్స్ చేయడం ఇష్టం లేకపోయినా కేవలం సినిమా కోసమే చేయవలసి ఉంటుందని తెలిపింది రెజీనా.
అందుకోసమే మా కష్టానికి తగ్గ రెమ్యూనరేషన్ మేము తీసుకుంటాము ప్రొడ్యూసర్లు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందే ఎక్కువగా అమౌంట్ ఇస్తారని తెలిపింది. ఇప్పుడు ఇదంతా ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయింది అందుకే హీరోయిన్లకు కూడా రొమాంటిక్ సీన్లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిపింది రెజీనా. సాధారణ సినిమాలలో ఇలాంటివి ఉండవు కాబట్టి తక్కువ రెమ్యూనికేషన్ ఇస్తారు. రొమాంటిక్స్ సన్నివేశాలకు డిమాండ్ చేస్తున్నారు అంటూ రెజినా తెలియజేసింది.