తెలుగు సినీ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఎంతోమంది స్టార్స్ హీరోల క్రేజ్ తగ్గించేలా చేస్తున్నాయి. ఆ తర్వాత ఆ క్రేజ్ ను కాపాడుకునేందుకు హీరోలు చాలా సతమతమవుతున్నారు. అలా ఈ ఏడాది సాలీడు హిట్ అందుకోవాల్సిన ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చిరంజీవి కూడా ఒకరు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాతో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు.
ఇక మరొక హీరో అక్కినేని బ్రదర్ నాగచైతన్య. ఇక గత ఏడాది నటించిన థాంక్యూ చిత్రం భారీ డిజాస్టర్ ని చవిచూసింది. ఈ ఏడాది చైతన్య నటించిన కస్టడీ చిత్రం విడుదల కాబోతోంది. దీంతో నాగచైతన్య ఆశలన్నీ కూడా ఈ సినిమా పైన పెట్టుకున్నారు. మరొక నటుడు అఖిల్ అఖిల్ కూడా హిట్ కొట్టే పరిస్థితి ఏర్పడింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు.ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో సక్సెస్ అందుకుంటేనే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే నాగార్జున కూడా వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు.
మరొక హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో పాన్ ఇండియా లెవెల్ లో బిజినెస్ జరుగుతున్న కలెక్షన్లు మాత్రం రాలేకపోతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ -k లాంటి సినిమాలలో నటించారు. కచ్చితంగా ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధించాలి. లేకపోతే ప్రభాస్ క్రేజ్ తగ్గిపోతుంది. ఇక మరొక హీరో విజయ్ దేవరకొండ. వరుసగా సినిమాలన్నీ చాలా ఫ్లాపులతో డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ప్రస్తుతం సమంతాతో కలిసి నటిస్తున్న ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. వీరితో పాటే సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్ ,నాని తదితరులు ఉన్నారని చెప్పవచ్చు.