డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి రవితేజ కలిసి నటించిన చిత్రం వాల్తేర్ వీరయ్య.ఈ సినిమా విడుదలై ఇప్పటికి రెండు రోజులు కావస్తున్న బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఈ సినిమా రూ .30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. చిరంజీవి ఈ సినిమాలో పూర్తిగా మాస్ లుక్ లో కనిపించారు. శనివారం రోజున ఈ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్‌ని నిర్వహించారు చిత్ర బృందం ఇందులో పాల్గొన్న చిరు డైరెక్టర్‌కు కొన్ని సూచనలను కూడా ఇచ్చారు.
నిర్మాత డబ్బును బట్టి దాఖలు చేయవద్దని సినిమాకు కావాల్సినవన్నీ పేపర్ వర్క్ లోనే పూర్తి చేయాలని తెలిపారు. అలాగే చిత్ర పరిశ్రమ బాగుండాలని దర్శకులు గుర్తించాలని తెలిపారు. నిర్మాతలు బాగుంటే నటీనటులు కూడా బాగా బతుకుతారని తెలిపారు.. చిరంజీవి మాట్లాడుతూ వాల్తేర్ వీరయ్య సినిమా కోసం టీం అందరితో కలిసి కృషి చేశాను అందుచేతనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే నమ్మకాన్ని కల్పించిందని తెలిపారు. మేము ఏదైతే అనుకున్నామో అదే నెరవేరింది దీంతో ఒక్కసారిగా అందరికీ మాటలు రాలేకపోయారని తెలిపారు చిరంజీవి.
సినిమా ఏదైనా సరే ప్రేక్షకుల స్పందన మా ఇంధనము అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఒక సినిమా అద్భుతంగా వస్తుందంటే అందుకు కారణం ఆ సినిమా పనిచేసే కార్మికులే అంటూ తెలియజేశారు చిరంజీవి. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క కార్మికులకు కూడా ఇది ఘనవిజయం లాంటిది అంటూ తెలిపారు. ఇక రవితేజ, డైరెక్టర్ బాబి, దేవిశ్రీప్రసాద్ ,నిర్మాతలు రవి నవీన్ మిగతా నటినటులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా సరే నిర్మాతలకు చెప్పిన బడ్జెట్లోనే పూర్తి చేయాలి అదే దర్శకులకు మొదటి సక్సెస్ సరికొత్త టెక్నాలజీని వాడి పనితనం చూపించడం కంటే కథను నమ్మి సాధారణ కెమెరాతో గొప్ప సినిమా తీయాలని తెలిపారు. తను ఏ ఒక్కరిని ఉద్దేశించి ఈ మాటలు అనడం లేదని కూడా తెలిపారు చిరంజీవి.