తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య.. అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు సంపాదించింది. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.. సౌందర్య చనిపోయినప్పటికీ ఆమెను మాత్రం మర్చిపోలేకపోతున్నారు ఆమె అభిమానులు. అయితే ఆమె చనిపోయినప్పుడు మరో హీరోయిన్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యిందని గతంలో కొన్ని వార్తలు వినిపించాయి.
సౌందర్య 1992లో గాంధర్వ అనే సినిమా తో అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె ఒక తెలుగులోనే కాకుండా తమిళ్ ,మలయాళం, కన్నడ భాషలలో 100 కు పైగా చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో అమ్మోరు సినిమాలో అవకాశం దక్కించుకొని మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా ఆ సినిమా తరువాత ఆమెకు మరిన్ని అవకాశాలు వెళ్ళబడ్డాయి. అప్పట్లో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా స్టార్ హీరోలు మాత్రం సౌందర్యాన్ని ఎంచుకునే వాళ్ళు. సౌందర్య అందం నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు
ఆ తరువాత 2003లో పెళ్లి చేసుకుంది సౌందర్య. తను పెళ్లి చేసుకుంది తన మేనమామనే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ తరువాత ఈమె BJP పార్టీ తరపున ప్రచారం కోసం 2004లో బెంగళూరు నుంచి కరీంనగర్ వరకు వెళ్తుండగా మధ్యలో విమానం కుప్పకూలి అక్కడే మరణించింది.ఆమె మరణించిన తరువాత తెలుగు ప్రేక్షకులే కాదు ఇతర భాషల ప్రేక్షకులు కూడా చాలా బాధపడ్డారు. అయితే ఆమె చనిపోయిన సమయంలో ఒక హీరోయిన్ మాత్రం సంతోషపడిందట ఎందుకంటే తనకే అవకాశాలు వస్తాయని అనుకుందని అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు స్నేహ.. ఈ విషయంపై స్నేహ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సౌందర్య చనిపోతే నేను ఎంతలా బాధపడ్డానో నాకు తెలుసు.. నా చుట్టూ ఉన్న వాళ్లకు తెలుసు.. సౌందర్య చనిపోయిన తరువాత హోమ్లీ క్యారెక్టర్స్ తనకు వచ్చాయని అనుకుంటున్నారని అయితే అటువంటిది ఏమీ లేదని ఇవన్నీ ఎవరో కావాలని పుకార్లు పుట్టించారని ఆమె చెప్పుకొచ్చింది.