దారి ఖర్చులకి రజనీకాంత్ ని డబ్బు అడిగితే.. కన్నీళ్లు పెట్టుకున్న రమాప్రభ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటి రమాప్రభ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. సుమారుగా తెలుగు, తమిళ్ భాషల్లో కలుపుకొని 1400 పైగా చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్ చిత్రాలలో రమాప్రభ – రాజబాబు జోడికి చాలా క్రేజ్ ఉండేది. నిమిషం తీరికలేనంత బిజీగా షూటింగ్లో పాల్గొనేవారు..ఈ జోడీ గుర్తింపు తెచ్చుకుని ఎక్కువ చిత్రాలలో నటిస్తూ హీరోయిన్లకు దీటుగా ఆస్తులు కూడా సంపాదించుకుంది రమాప్రభ.. అడిగినవారికి కాదనకుండా సహాయం చేసేది. కోట్ల ఆస్తులు సంపాదించినా చివరికి ఒక హీరోని నమ్మి దారుణంగా మోసపోయింది.

Ramaprabha: ఆ హీరోని నమ్మి నట్టేట మునిగిపోయా.. రమాప్రభ..!!

చివరికి చేతులు చిల్లిగవ్వ లేకుండా నడిరోడ్డు మీదకు వచ్చింది అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సహాయం కోసం ఆయన ఇంటికి వెళ్తే అక్కడ రజనీకాంత్ చేసిన సహాయం చేసి ఆమె కంటతడి పెట్టుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం మనదేశంలోనే కాదు జపాన్ వంటి దేశంలో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు . 70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేయడమే కాకుండా భారీ రేంజ్ లో పారిపోషకం కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ మీద ఎలా ఉన్నప్పటికీ నిజజీవితంలో మాత్రం ఆయన చాలా నిరాడంబరుడు..

Suresh Krissna's Rajinikanth-Starrer Annamalai: The Anti-Revenge Masala

ఎంత స్టార్ పొజిషన్లో ఉన్నప్పటికీ ఆయన ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలనే నిదర్శనాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాదు అభిమానులను కూడా నేరుగా కలిసి పరామర్శించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కష్టం విలువ తెలుసు కాబట్టి సహాయం కోరి ఎవరైనా ఆయన ఇంటి వద్దకు వస్తే తప్పకుండా ఆదుకుంటారు. అలా సహాయం పొందిన వారి జాబితాలో రమాప్రభ కూడా ఒకరు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ..” నా జీవితంలో ఒక వ్యక్తిని నమ్మి నిలువునా మోసపోయాను.. ఆస్తులన్నీ కరిగిపోయాయి. నడిరోడ్డు మీద కట్టుబట్టలతో నిలబడ్డాను. కనీసం దారి ఖర్చులకు డబ్బులు కావాలని ఇంటికి వెళ్లడానికి.. రజినీకాంత్ దగ్గరికి వెళ్తే ఆయన నా పరిస్థితి చూసి ఎంతో బాధపడ్డారు. వెంటనే తన దగ్గరున్న 40 వేల రూపాయలను నాకు అందజేశారు. రజనీకాంత్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే అంత మొత్తం నాకు ఇవ్వడంతో నా కష్టాలు చాలా వరకు తీరిపోయాయి. ఆ డబ్బు చూడగానే నా కంటి వెంట నీళ్లు వచ్చాయి” అంటూ తెలిపింది రమాప్రభ.

Share.