అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన యంగ్ హీరో సుశాంత్ చాలా కాలం నుంచి ఓ మంచి హిట్ సినిమా కోసం వేచి చూస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో మంచి పాత్ర పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డేతో సుశాంత్, నివేదా పేతురాజ్ ఈ సినిమాలో సందడి చేశారు. కాగా, ఎస్.దర్శన్ డైరెక్షన్లో సుశాంత్ హీరోగా వస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.
తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు. సినిమా భిన్నమైన కథాంశంతో వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నది. వెన్నెల కిషోర్, వెంకట్, అభినవ్ గోమటం, ప్రియదర్శి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘చి.ల.సౌ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత సుశాంత్ సోలోగా హీరోగా వస్తున్న ఫిల్మ్ ఇదే. ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ బ్యానర్‌పై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.