జబర్దస్త్ కార్యక్రమం తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది యాంకర్ అనసూయ. ఈమధ్య ఈ కార్యక్రమాన్ని వదిలేసి కేవలం సినిమాలలోనే నటిస్తూ బిజీగా ఉంటోంది. జబర్దస్త్ కార్యక్రమం విడిచి ఆ తర్వాత పలు చానల్స్ లో కూడా కనిపించింది అనసూయ. కానీ అక్కడ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక పోయింది దీంతో కేవలం సినిమాలలోని పూర్తిగ తన సమయాన్ని కేటాయిస్తోంది.
కానీ సినిమాలలో కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో దీంతో అనసూయ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక మల్లెమాల లో జాయిన్ అవ్వాలని జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించాలని అనసూయ పలు ప్రయత్నాలు చేస్తూ అందని వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ మల్లెమాలవారు అనసూయను రానివ్వలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు విషయం ఏంటన్న వీధి తెలియాల్సి ఉన్నది.
ఇక రష్మీ కూడా అదే దారిలో కూడా వెళ్లబోతోందని సినిమాలలో బిజీ అవ్వాలని ఆశిస్తోంది అంటే ప్రచారం జరుగుతోంది. కానీ తనకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదని.. తన ప్రియారిటి మొత్తం టీవీ రంగానికి అన్నట్లుగా రష్మీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను టీవీ రంగాన్ని వదిలేసి వెళ్ళనంటూ కూడా స్పష్టంగా తెలియజేయడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న ప్రచారాలను అసలు పట్టించుకోనని ప్రస్తుతానికి తన దృష్టి అంతా కూడా చేస్తున్న టీవీ కార్యక్రమాలపైనే ఉందంటూ తెలుపుతోంది రష్మీ.
అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడి ప్రస్తుతం చాలా బాధపడుతున్న సంగతి తెలిసిందే అందుకే అనసూయ మాదిరిగా కాకుండా పలు నిర్ణయాలను తీసుకొని రష్మీ తన కెరీర్ ను కొనసాగిస్తోందని ఆమె సన్నిహితులు తెలియజేసినట్లు సమాచారం. అనసూయ చేసిన తప్పు తాను చేయనన్నట్లుగా రష్మీ గౌతమ్ తన సన్నిహితులతో తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లయిన బుల్లితెరపై మాత్రమే కనిపించాలని.. వెండితెరపై వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానని అలాగే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తానని రష్మి గౌతమ్ తెలుపుతోంది.