తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటనను ప్రదర్శించినట్లు చాలామందే ఉన్నారు. కానీ నటుడు పోసాని లాగా నటించేవారు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు.. ఇక ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి 37 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు నా కెరీర్లో ఏ మిస్టేక్ చేయలేదు.పోసాని పలు సినిమాలలో నటించి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకవైపు నటుడిగా ,కమెడియన్ గా దర్శక నిర్మాతగా రచయితగా సత్తా చాటిన ఆయన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పోసాని కృష్ణ మురళి మొదట రైటర్ గా పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా ఇండస్ట్రీలో రాణించారు. పోసాని కృష్ణమురళి నిర్మాతగా ఉన్నప్పుడు ఇండస్ట్రీలో పెట్టినంత మంచి భోజనం ఎవరు పెట్టలేదట. భోజనానికి మహా అయితే ఐదు లక్షల అవుతుంది..కానీ నేను రూ .30 లక్షలు ఖర్చు పెట్టా.. పోసాని సినిమా ఇండస్ట్రీలోకి రావటానికి చాలా కష్టపడ్డాడట. మొదటగా సత్యానంద్ దగ్గరికి వెళ్తే నాలుగేళ్ల తర్వాత కనపడమన్నాడట. ఆ తరువాత పరచురీ బ్రదర్స్ దగ్గరికి వెళితే ఇప్పుడు కాళీ లేవని చెప్పారట
కానీ పోసాని కృష్ణ మురళి పట్టిన పట్టు విడవకుండా గేటు దగ్గరే నిలబడి ఉన్నాడట. ఆ టైంలో గోపాలకృష్ణ వచ్చి రేపు మార్నింగ్ 5:30 కి కనపడు అన్నాడట. అప్పుడు గోపాలకృష్ణ అంతకుముందే వెళ్లి అక్కడ ఉన్నారట ఆ టైంలో వెంకటేశ్వరరావు గోపాలకృష్ణ ఇద్దరు వచ్చారు. బాగా చదువుకున్న ఏదైనా జాబ్ చేయొచ్చు కదా అన్నారు. సరే పేకాట పిల్లోడు అనే పాత్రకు కొన్ని డైలాగ్స్ రాయమని చెప్పారట. 70 డైలాగులు రాస్తే అందులో 35 డైలాగులను సినిమాలో యూస్ చేసుకున్నారట అయితే ఫస్ట్ సినిమాల మీద తనకి ఇష్టం లేదని రైటర్ గా ఫస్ట్ ఫిలిం వచ్చేదాకా కాస్త భయంతోనే ఉన్నానని తెలిపారు పోసాని.