తాజాగా సింగర్ స్మిత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో నిజం విత్ స్మిత టాక్ షో కి సంబంధించిన మూడవ ఎపిసోడ్ ఈరోజు నుంచి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్లో రానా , నాని జంటగా పాల్గొన్నారు. ఇకపోతే రానాతో తనకి ఉన్న అనుబంధాన్ని, స్నేహాన్ని గురించి స్పందిస్తూ నాని ఇలా తెలిపారు.. ” అష్టా చమ్మా సినిమా చూసేటప్పుడు నా సినిమా ఎవరు చూస్తారు అని అనుకునేవాడిని… అలా మూడు , నాలుగు సినిమాలు చేశాను. ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ లలో నాకు పెద్దగా ఎవరు కూడా పరిచయం లేదు..
నా నటన గురించి గానీ , నా సినిమాల గురించి గానీ మాట్లాడేవారు కాదు.. దాంతో నా సినిమాలను ఎవరు చూడడం లేదేమో అనే ఆలోచనలో ఉండేవాన్ని.. కానీ ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా నా గురించి మాట్లాడారు.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన వారిలో ఎవరిపై బెట్టు పెడతారన్న ప్రశ్నకు ఆయన నా పేరు చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అలా నా గురించి మాట్లాడడం అదే మొదటిసారి.. అప్పటికి నేను బయట రానాని చూడలేదు. కానీ ఆయన పట్ల అభిమానం పూర్తిగా పెరిగిపోయింది.
తర్వాత మేమిద్దరం కలుసుకున్న కొద్దీ స్నేహం పెరుగుతూ వచ్చింది . మేమిద్దరం కలిసి నటించాలనే కోరిక ఉంది ..ఆ విషయాన్ని కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము.. కానీ ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో అని నాని తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈరోజు సోనీ లైవ్ లో నిజం విత్ స్మిత షో స్ట్రీమింగ్ అవుతోంది.