టాలీవుడ్ లోఅక్కినేని నాగార్జునకి ఎంత ఇమేజ్ ఉందో అలాగే తన కుమారుడు నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నారు.. ఎప్పుడైతే సమంతతో విడాకులు తీసుకున్నారో అప్పటినుంచి నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ గాసిప్స్ వస్తున్నాయి. ఈమధ్య నాగచైతన్య పై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే మజిలీ సినిమాలో సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో చైతు ప్రేమాయణం నడుపుతున్నట్లు రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చైతు తో పెళ్లి విషయంపై స్పందించారు. వారిద్దరిపై వచ్చిన రూమర్లకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మజిలీ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కానీ చైతు ఇటీవల కాలంలో అసలు టచ్ లోనే లేను లేడని రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో అవకాశం రావటానికి చైతు కారణమని చాలా మంది అనుకుంటున్నారు.కానీ అది ఏ మాత్రం నిజం కాదని ఈ బ్యూటీ తేల్చి చెప్పేసింది.
ఇక చైతు దివ్యాంశ కౌశిక్ పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందిస్తూ.. ఈ విషయం విని నేను ఆశ్చర్యానికి గురయ్యారు. అయినప్పటికీ.. ఐ లవ్ యు నాగచైతన్య మంచి వ్యక్తి అని పొగడ్తల వర్షం కురిపించింది. చైతు పై తనకు క్రష్ ఉందని చాలా బాగుంటాడని ఆమె అన్నారు. చైతు తనకు సీనియర్ అని సెట్స్ లోకి వచ్చినప్పుడు కూర్చోండి అని గౌరవంగా లేచి నిలబడతాడని అంతటి గౌరవం ఇస్తారని తెలిపింది దివ్యాంశ కౌశిక్.. చైతుపై అలాగే దివ్యాంశ మీద వస్తున్న రూమర్స్ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చింది.