సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం సక్సెస్ అవ్వాలని ఎంట్రీ ఇస్తుంటారు. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన తరువాత పాపులారిటీ పెంచుకోవాలని ప్రతి ఒక్కరు ఆత్రుతగా ఉంటారు.అందరూ కూడా సక్సెస్ సాధించలేరని చెప్పవచ్చు. కొంతమంది మాత్రం అందం టాలెంట్ నటన ఉన్న సరే పెద్దగా సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ మాధవిలత కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మాధవి అతి తక్కువ సినిమాలు చేసి ఫెడ్ అవుట్ హీరోయిన్ గా పేరు సంపాదించింది
నచ్చావులే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మాధవి లత ఆ తర్వాత నానితో కలిసి స్నేహితుడా ,అరవింద్-2 వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.ఎందుకో డైరెక్టర్లు మాత్రం ఈ అమ్మడుకు అవకాశాలు ఇవ్వలేదు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ నిత్యం పలు విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది మాధవి లత. ముఖ్యంగా సమంత విషయంలో స్పందించి అప్పట్లో తెగ వైరల్ గా మారింది.
ఇప్పుడు తాజాగా మరొకసారి మాధవి లత పెళ్లి పై చేసిన ఒక పోస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. అదేమిటంటే పెళ్లి పై గట్టిగా ఒక కౌంటర్ ఇస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసింది.. ఒక అమ్మాయి వివాహం చేసుకోవాలి అంటే ముఖ్యంగా అవసరమయ్యింది వయసు ఒకటే కాదు ఆమె శారీరకంగా మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి.. పెళ్లి అంటే బొమ్మలాట పెళ్లి కాదు అది ఒక పవిత్రమైన నిర్ణయం అంటూ తెలియజేసింది.
ప్రస్తుతం నేను శారీరకంగా మానసికంగా అందుకు సిద్ధంగా లేను నా భవిష్యత్తు పైన నాకు నమ్మకం లేదు.. ఇది నా నిర్ణయం.. ఇదే నా జీవితం అంటూ ఒక పోస్ట్ అని షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోదని సింగిల్గానే ఉండిపోతుంది అంటూ హాట్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మాధవి లత చేసిన ఈ కామెంట్లు తెగ వైరల్ గా మారుతున్నాయి.