గతంలో తప్పులు చేశాను.. ఇప్పుడు తెలుసుకున్న రష్మి షాకింగ్ కామెంట్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెర పై యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిందే.జబర్దస్త్ షో తో భారీగా పాపులారిటీ సంపాదించుకుంది రష్మి. అంతేకాకుండా వెండి తేరపై పలు సినిమాల్లో నటించింది. కానీ అక్కడ సక్సెస్ కాకపోవటంతో బుల్లితెరపై పరిమితం అయింది. ఒక జబర్దస్త్ షో నే కాకుండా పలు షోలకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది.

Rashmi Gautam | చిలుక పచ్చ డ్రెస్‌లో గాలం వేస్తున్న రష్మి గౌతమ్..-Namasthe  Telangana

అలాగే రష్మీకి జంతువులంటే ఎనలేని ప్రేమ వాటికి ఏదన్నా జరిగితే సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. జంతువుల విషయంలో ఆమె ఎంతవరకు అయినా వెళుతుంది. కేవలం జంతువుల విషయంలోనే కాకుండా సమాజంలో జరుగుతున్న అరాచకాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఒకవైపు యాంకర్ గా అటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ను షేర్ చేస్తూ కుర్ర కారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా రష్మీ పాల ఉత్పత్తులపై వివాదాస్పద ట్విట్ చేసింది. కొన్నిసార్లు రష్మీ వివాదాల్లో కూడా నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాల ఉత్పత్తి వల్ల మరోసారి వార్తల్లో నిలిచింది. తాను పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం మానేశాను అని రష్మీ తన ట్విట్లు రాసుకుంది.వీడియో స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ నేటిజన్స్ ఈ ట్విట్ పై స్పందిస్తున్నారు. ఈ సెలబ్రిటీలందరూ ఇంతే డబ్బులు కోసం ఏమైనా చేస్తారు ఏమైనా మాట్లాడుతారు. తర్వాత ఇలా పోస్టులు పెడతారు. అని కామెంట్ చేశారు.

rashmi gautam (@rashmigautam27) / Twitter
ఇక రష్మీ ఈ కామెంట్స్ కు స్పందిస్తూ అవును గతంలో తెలియక కొన్ని తప్పులు చేశాను కానీ నేను కొన్నాళ్ల నుండి పాలు తాగటం మానేశాను. నా చర్మం పై అనారోగ్య ప్రభావం పడటం నేను గమనించాను. ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం గురించి తెలుసుకున్నాను అందుకని వాటిని ప్రమోట్ చేయడం ఆపేశానని తెలిపింది రష్మీ.

Share.