టాలీవుడ్ లో నటుడు గోపీచంద్ మొదట విలన్ గా తెలుగు తెరకు బాగా సుపరిచితుడే..ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదట తొలివలపు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. కానీ ఆ మధ్యలో కొన్ని చిత్రాలలో గోపీచంద్ విలన్ గా నటించారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ ఫుల్ హీరోగా తన కెరీర్‌ను కొనసాగించారు. డైరెక్టర్ టి కృష్ణ కుమారుడైన మొదట ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాగా ఆకట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ కు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా తన తోటి హీరోలు ఫుల్ ఫాన్స్ అంటూ చాలా గోల చేస్తూ ఉంటే సైలెంట్ హీరోగా గోపీచంద్ తన మార్కును చాటుతున్నారు. ఈ ఏడాది ఆరడుగుల బుల్లెట్, పక్కాకమర్షియల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. వచ్చే యేడాది శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. మొదట 2001లో తొలివలపు సినిమా ద్వారా తన సినీ కెరియర్ను మొదలుపెట్టి ఇప్పటికి 21 సంవత్సరాలు పైనే అవుతోంది. ఈ రెండు దశాబ్దాలలో ఆయన తీసిన సినిమాలు కేవలం 20 మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చు.
ముఖ్యంగా గోపీచంద్ హీరో నుంచి విలన్‌గా ఆ తర్వాత మళ్లీ హీరోగా మారుతున్న సమయంలో హీరోగా కంటే గోపీచంద్‌కి విలన్ గానే ఎక్కువగా ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా ముందుకు వెళ్లలేక పోతున్నారని అపోహ కూడా ఉండడం జరిగిందట.విలన్ గా గోపీచంద్ ఎందుకు మారాడు ఒక విషయంపై మాట్లాడుతూ.. తను నటించిన మొదటి చిత్రం తొలివలపు సినిమా ఫ్లాప్ కావడంతో గోపీచంద్ కు ఒక ఐదు నుంచి ఆరు నెలల వరకు ఒక్క సినిమా అవకాశం రాలేదట. ఆ సమయంలో తేజ మరియు కృష్ణవంశీ వీరికి విలన్ గా నటించమని సలహా ఇచ్చారట.