హైపర్ ఆది అలాంటోడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రైజింగ్ రాజు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

జబర్దస్త్ కామెడీ షో వచ్చిన తర్వాత ఎంతో మంది పాపులారిటీ అవుతున్న విషయం తెలిసిందే..అందులో హైపర్ ఆది కూడా ఒకరు. ఈయన తన పంచులతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడమే కాకుండా సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటూ ఉంటాడు. అంతేకాదు ఈయన చేసే వెకిలి చేష్టలు, పనుల వల్ల హీరోల అభిమానుల చేతుల్లో దెబ్బలు కూడా తింటూ ఉంటాడు. ఇకపోతే హైపర్ ఆది అలాంటివాడే అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు రైజింగ్ రాజు..

ఇకపోతే ఆది టీం లో రైజింగ్ రాజు కూడా చేస్తున్న విషయం తెలిసిందే..కానీ కరోనా సమయంలో రైజింగ్ రాజు ఆది స్కిట్ లో పనిచేయలేదు ..అప్పుడంతా రాజు ఎక్కడికి వెళ్లి పోయాడు.. ఏమైపోయారు అంటూ తెగ ఆరా తీశారు. అయితే ఆర్నెళ్ళ తర్వాత రాజు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు ఎప్పట్లాగే కలిసి స్కిట్స్ చేసుకుంటున్నారు. మరి అప్పుడు రాజు ఎందుకు మానేసాడనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కరోనా సమయంలోనే తనకు మనవరాలు పుట్టిందని.. ఆ సమయంలో తాను బయటికి వెళ్తే పాపకు లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని భయపడి ఇంట్లోనే ఉండిపోయానని చెప్పాడు రాజు.

ఆ సమయంలో ప్రతీనెల తనకు ఇంటికి పేమెంట్ పంపించాడని హైపర్ ఆది గురించి ఆసక్తికరమైన నిజాలు బయటపెట్టాడు. కాళ్ళు మొక్కుదాం అంటే వయసులో చిన్నోడు అయిపోయాడు.. నిజంగా హైపర్ ఆది దేవుడు అంటున్నాడు రాజు. అంతే కాదు నేను పని చేసినా చేయకపోయినా నాకు మాత్రం డబ్బులు ఇవ్వడం మానడం లేదు.. ఇంతటి గొప్ప వ్యక్తి నా జీవితంలో చూడలేదు అంటూ చాలా గొప్పగా చెప్పాడు రాజు.

Share.