టాలీవుడ్ లో అతి చిన్న వయసు నుంచే తన తండ్రితో సినిమాలలో నటించి క్రేజును సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు. మహేశ్ గురించి ,సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఈ మధ్య మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాలో ఆయన గ్లామర్ కు అమ్మాయిలు ఫిదా అవుతున్నారనే చెప్పాలి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ప్రేమ పెళ్లి గురించి మనకు తెలిసిందే.
వీరిద్దరి పరిచయం వంశీ సినిమాతో ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అంతేకాకుండా వీరి ప్రేమను ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకున్నారు. ఇక నమ్రత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొట్టమొదటిగా వంశీ సినిమాతో తెలుగు తెర ముందుకు వచ్చింది నమ్రత. నమ్రత ఆ సినిమాతోనే మహేష్ బాబు తో ప్రేమలో పడింది. ఇకపోతే నమ్రత ఒక ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
యాంకర్ నమ్రతను కొన్ని ప్రశ్నలు అడగగా.. నమ్రత తెలియజేయడం జరిగింది. యాంకర్ మాట్లాడుతూ మీరు పూర్తిగా నార్త్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి వాతావరణం మీకు ఎలా సెట్ అయ్యింది. అనే ప్రశ్న ఎదురయ్యగా. ఈ ప్రశ్నకు నమ్రత మాట్లాడుతూ మహేష్ బాబు డేటింగ్ లో ఉన్న సమయంలోనే అతనితో పాటే షూటింగ్ కి వెళ్తుండేదానిని. షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబుతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉండే దాన్న డేటింగ్ సమయంలో మహేష్ బాబు తో ఉంటే అసలు బోర్ కొట్టేదే కాదు.
అంతేకాకుండా మహేష్ బాబు తో పార్టీ తన స్నేహితులు అలాగే వాళ్ళ అక్క కలిసి బాగా పార్టీలకు వెళ్లే వాళ్ళం. ఇలా అందరం కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసేవాళ్లం. మహేష్ బాబు తో ఉన్నప్పుడు ఒంటరిగా ఎప్పుడు ఫీల్ కాలేదని అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ మహేష్ కలగనివ్వలేదని ఆమె తెలిపారు.
డేటింగ్ సమయంలో హైదరాబాద్ టు ముంబై తిరుగుతూ ఉండేదాన్ని అందుకే ఇక్కడి వాతావరణం నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. అంటూ అప్పటి స్వీట్ మెమోరీస్ ని గుర్తు చేసుకుంది నమ్రత