టాలీవుడ్ లో అందాల హీరోయిన్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు. మొదట సూపర్ సినిమాతో తన సినీ కెరియర్ ని మొదలుపెట్టిన ఈమె.. అటు తరువాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి, లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇక అరుంధతి సినిమాతో మంచి క్రేజ్ ను అందుకుంది. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.తెలుగులో పాటు తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది అనుష్క.
చివరిగా అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలీశెట్టితో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా ఎప్పుడు సోషల్ మీడియాలో అనుష్క శెట్టి గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. సినిమా తారల పేర్లు చెప్పి కొంతమంది డబ్బులు వసూలు చేయడం మనం చూసే ఉన్నాము.. కానీ తాజాగా అనుష్క శెట్టి విషయంలో కూడా అలాంటిదే జరిగినట్లు తెలుస్తోంది.
తాజాగా అనుష్క శెట్టి పేరుతో ఒక పెద్ద మోసం జరిగిందని తెలుస్తోంది. హీరోయిన్ అనుష్క ,సంగీత దర్శకుడు మణిశర్మల అపాయింట్మెంట్ ఇప్పిస్తానని విశ్వకర్మ క్రియేషన్ అధినేత నిర్మాత లక్ష్మణ్ చారి ఎల్లారెడ్డి అనే వ్యక్తిని మోసం చేశారట. అతని దగ్గర ఏకంగా రూ .50 లక్షల పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. అనుష్క,మణిశర్మ అపాయింట్మెంట్లు దక్కకపోవడంతో లక్ష్మణ చారి మోసపోయానని ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు.