జాతీయ మీడియా పై హృతిక్ రోషన్ ఫైర్

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ రోజు తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా పలు జాతీయ వెబ్ సైట్స్ పై ఫైర్ అయ్యరు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నూతన సినిమాలో నటి దిశా పాటని కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారని సమాచారం. అయితే దిశా పాటని ఈ సినిమాలో నటిస్తున్న హీరో హృతిక్ రోషన్ ప్రవర్తన నచ్చక ఈ సినిమా నుండి తప్పుకుందని పలు పత్రికలు మరియు వెబ్ సైట్స్ లో ప్రచురించారు.

ఇది చుసిన హృతిక్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వారికి ఘాటైన సమాధానం ఇచ్చారు. ఇదంతా ‘ట్రాష్’ అని…డియర్ పత్రిక విలేకరి గారు..” మీకు జిమ్ చేసే అలవాటు ఉంటె దయచేసి జిమ్ కి వెళ్లి ఎక్సరసైజ్ చేయండని..ముఖ్యంగా 20 డాంకీ కిక్స్, 20 మంకీ రోల్స్ ఇంకో రెండు డాగ్ జంప్స్ చేయండని, అలా చేస్తే మీ మైండ్ లో ఉన్న చెడు ఆలోచనలు అన్ని బయటకి పోతాయి అని రిప్లై ఇచ్చారు.

దీని పై కొన్ని నిమిషాల క్రితం దిశా స్పందించి ‘ హృతిక్ సర్ మరియు నా పై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అతను చాల డీసెంట్ పర్సన్, నేను అసలు ఏ సినిమా నుండి తప్పుకోలేదని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు ‘

Share.