సమంత ఐటమ్ సాంగ్ గందరగోళం… ఇతర సాంగ్స్ కూడా అలానే ఉన్నాయంటూ?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ అయినా ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా అనే సాంగ్ ప్రస్తుతం వివాదాన్ని సృష్టిస్తోంది. మగజాతి అవమానించారంటూ ఏకంగా పురుషుల సంఘం సమంతా పై కేసు నమోదు చేసారు.. కేసు నమోదు అయ్యేదాకా వ్యవహారం నడిచింది అంటే ఈ సాంగ్ పై జరుగుతున్న రచ్చను అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మహిళలు కించపరుస్తూ, అవహేళన చేస్తూ గతంలో వచ్చిన పలు రకాల సినిమాలలో వచ్చిన సాంగ్స్ పై తీవ్ర చర్చకు తెర తీసింది.

పుష్ప సినిమాలో సమంతా చేసిన ఐటమ్ సాంగ్ వివాదాల్లో చిక్కుకుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ లో సింగర్ ఇంద్రావతి చౌహాన్ పాడిన ఈ పాట యూత్ ను షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ పాట మరొకవైపు ఈ పాట మగాళ్లను కించపరిచేలా ఉంది అంటూ ఆంధ్ర ప్రదేశ్ పురుషుల సంఘం కోర్టుకెక్కింది. ఇదే విషయంపై చంద్రబోస్ క్షమాపణ చెప్పినా కూడా ఈ వివాదం సద్దుమణిగిన కనిపించట్లేదు. అంతే కాకుండా ఆల్ ఐటమ్ సాంగ్స్ డివోషనల్ సాంగ్స్ అంటూ ఆ ట్యూన్ లో భక్తి గీతాలు పాడి సమర్థించుకోవడం పెద్ద దుమారం రాజేస్తోంది.

ఈ వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించడంతో పాటు తీవ్రంగా స్పందించడంతో పాటు ఐటమ్స్ నెంబర్ లు .. దేవుడి పాటలు రెండు ఒకటేనా? హిందూ సమాజానికి దేవి శ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ మండిపడ్డారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఈ పాటకు పేరడిగా మేల్ వెర్షన్‌ అంటూ రచయిత ప్రశాంత్‌ రాసిన పాటను జానపద గాయకుడు ర‌మ‌ణ ఆల‌పించిన పాట ప్రస్తుతం యూ ట్యూబ్‌లో పెద్ద సంచలనంగా మారింది. మిలియన్స్ వ్యూస్‏తో దూసుకుపోతుంది.

Share.