గతంలో ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు నందమూరి తారకరత్న. ఏడాదికి తొమ్మిది సినిమాలు ఒకేసారి విడుదల చేసి హీరోలను సైతం భయభ్రాంతులకు గురి చేశారు. అయితే ఆ తర్వాత అడపాదడపా సినిమాలలో విలన్ గా కూడా నటించారు. ఇక సక్సెస్ కాలేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం తన బిజినెస్లను చూసుకుంటూ ఉండేవారు. చివరిగా 9 అవర్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించారు.
తాజాగా నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర యువమంగళం నిన్నటి రోజున మొదలుపెట్టారు. అయితే తారకరత్న పాదయాత్రలో నడుస్తూ సోమశిల్లీ పడిపోవడంతో ఆసుపత్రికి తరలించిన వైద్యులు గుండెపోటుగా నిర్ధారించడంతో అటు టిడిపి అభిమానులు ,నందమూరి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే నిన్న మొన్నటిదాకా పాదయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న తారకరత్న ఇలా గుండెపోటు రావడం ఏంటని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న హార్ట్ లో బ్లాక్ ఎక్కువగా ఉన్నాయని అందువల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు సూచించారు. హార్టులో కుడి ఎడమవైపు 95% బ్లాక్ ఉన్నట్లుగా గుర్తించారు.
దీంతో బెంగళూరుకి తరలింపు పై కుటుంబ సభ్యులు ఆలోచించి కుప్పంలో పిఎస్ నుంచి వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.కానీ వైద్య బృందం మాత్రం బెంగళూరుకి తరలించేలోగా సెకండ్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అందుచేతనే కుప్పంలోని వైద్యం చేయించాలని కుటుంబ సభ్యులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ హార్ట్ గురించి కూడా డాక్టర్ల మధ్య చర్చ నడుస్తోంది. కాసేపట్లో తారకరత్న సతీమణి కుప్పంలో చేరుకోనున్నారు. ఆమె కుప్పం వచ్చాక బెంగళూరుకు తరలించాల వద్ద అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారని వైద్యులు తెలిపారు.