తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు పోసాని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం నటుడుగా బిజీగా ఉండడమే కాకుండా అధికార పార్టీలో నేతగా కూడా బిజీగా ఉన్నారు. ఎంతమంది టాలెంట్ నటులను ప్రోత్సహించిన ఘనత ఈ నటుడుకి సొంతమని చెప్పవచ్చు. రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా పోసాని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే పోసాని మురళి కుటుంబం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
తాజాగా ఒక షోలో పోసాని కృష్ణ మురళి తన తండ్రి గురించి మాట్లాడుతూ..తన తండ్రి చిన్న వయసులోనే మరణించారని తెలియజేశారు. తన తండ్రికి మొదట ఎలాంటి చెడు అలవాట్లు లేవని అయితే మా నాన్నకు ఎవరో పేకాట నేర్పించారని తెలిపారు పోసాని. పోసాని తండ్రి ఊర్లో ఒక వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నావ్ సుబ్బారావ్ అని అడగగా అందుకు సమాధానం చెప్పలేక పొలానికి వెళ్లి అక్కడ పురుగుల మందులు తాగి చనిపోయారని తెలియజేశారు. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .ఎప్పుడూ నవ్వుతూ ఉండే పోసాని తన నవ్వు వెనక ఇంత బాధ ఉందా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
పోసాని తిరిగి సినిమాలలోకి రావాలని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు.ఈమధ్య బుల్లితెర పైన జడ్జ్ గా కూడా పలు షోలకు వ్యవహరించారు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రోజుకు రూ .2లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరి వచ్చే ఎన్నికలలో వైసిపి పార్టీ తరఫున పోటీ చేస్తారేమో చూడాలి మరి. ఆ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లే కోసానికి సినిమా ఆఫర్లు తగ్గాయని సమాచారం.