అందాల తారల హడావిడి ఫొటోల్లో చూడండి

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ చిత్రం హౌస్ ఫుల్ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకొందో అందరికి తెలిసిందే. మొదటి భాగం విడుదలైన తర్వాత వచ్చిన రెండు భాగాలు కూడా మంచి విజయం సాధించాయి. మొదటి మూడు భాగాలు హిట్ కావటంతో ఇక ఇప్పుడు చిత్ర దర్శకుడు సినిమా నాలుగవ భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం హౌస్ ఫుల్ 4 లండన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో ప్రముఖ నటులు అక్షయ్ కుమార్, బాబీ డియోల్ మరియు నటీమణులు పూజ హెగ్డే, కృతి కర్బందా మరియు కృతి సనాన్ పాల్గొన్నారు. నృత్య దర్శకురాలు ఫరా ఖాన్ కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే తాజాగా సినిమా దర్శకుడు సాజిద్ నాదియద్వలా హీరోయిన్లు పూజ, కృతి సనన్, కృతి కర్బందా తో దిగిన ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేయగా అది నెట్ లో వైరల్ గా మారింది. అందాల తరలందరిని ఒకే చోట చూసే సరికి వారి అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.



Share.