ఈ మధ్య కాలంలో పిల్లలను ఆకట్టుకునే సినిమాలు ఏవీ రావడం లేదు. ఈ తరుణంలో పిల్లలకు అద్బుతమైన వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో హౌస్ అరెస్ట్ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 90ఎం ఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్రా ఈ సినిమాను డైరెక్షన్ చేస్తున్నారు. సోమవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అనీల్ రావిపూడి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
ఆగస్టు 27వ తేదీ థియేట్రికల్ విడుదల కానుంది. ట్రైలర్ కు మంచి మార్కులు పడ్డాయి. పిల్లలను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కుతోంది. హౌస్ అరెస్ట్ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. చంద్రబోస్ ఈ సినిమాకు పాటలను అందించాడు. ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిలు హాస్యభరితంగా నటించారు. కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా కానుంది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.