Honeyrose..టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి సినిమాతో ఫ్లాప్ అందుకున్న హీరోయిన్లలో హనీరోజ్ (Honeyrose )ఒకరు. ఆలయం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ఎప్పుడు విడుదలైందో కూడా తెలియదు. టాలీవుడ్ లో మొదటి సినిమా బోల్తా కొట్టింది. కానీ రెండో సినిమా మాత్రం తనకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది.. అదే బాలకృష్ణ తో నటించిన వీర సింహారెడ్డి సినిమా. అందులో రెండు షేడ్స్ రోల్స్ లో నటించిన హనీ రోజ్ ఆ రెండు పాత్రలకు తన వంతు న్యాయం చేసిందని చెప్పవచ్చు..
అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో స్టార్ స్టేటస్ అందుకున్న హనిరోజ్ తెలుగులో కూడా సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా యువత కలల రాణిగా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. ఇది కాస్త పక్కన పెడితే ఈ మధ్యకాలంలో బాడీ షేమింగ్ గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో షాప్స్ ఓపెనింగ్ కార్యక్రమాలకు వెళుతున్న హనీరోజ్ ఆమె పైన పలు రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు… నేను సినిమాలలో పాత్రలకు అనుగుణంగా ఉంటానని. నాకు నచ్చిన విధంగా నేను ఉంటాను నాకు ఇష్టమైతేనే చేస్తాను. అంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఎప్పుడు ఎలాంటి దుస్తులను ధరించాలి ?ఏ విధంగా కనిపించాలి ?అనేది నటీనటుల వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని ఆమె తెలుపుతోంది..
ఏ హీరోయిన్ కొంచెం బరువు తగ్గితే లేదంటే బరువు పెరిగిన అభిమానుల నుంచి ట్రోల్స్ వస్తాయని.. ఇక సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్స్ మానసిక ఒత్తిడిని కలిగిస్తాయని హనిరొజ్ కామెంట్స్ చేసింది. కానీ అలాంటిది అసలు పట్టించుకోకూడదు అంటూ తెలుపుతోంది. అంతే కాకుండా రోజురోజుకు ఈమె ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరిగిపోతోంది.