ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయింది.మలయాళం హీరోయిన్ అయినప్పటికీ బాలయ్య డబల్ రోల్ లో పోషించిన ఈ చిత్రంలో నటించింది. ఇందులో శృతిహాసన్ ,వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు హనీ రోజు కూడా బాగా ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగిపోయింది. నేటిజెన్లు సైతం సోషల్ మీడియాలో ఈమె ఫోటోలను వెతికి మరి ఫాలో అవుతున్నారు.
దీంతో ఈమె అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ఈమె సరికొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. ఇదే సమయంలో హానీ రోజ్ బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు పలు ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం తెలుగులో క్రష్ గా మారిపోయిన హనీరోజ్.. 14 సంవత్సరాల క్రితమే ఒక్క తెలుగు సినిమాలో నటించింది. అయితే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఆ సినిమా పేరు ఆలయం ఈ సినిమాని సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఇందులో నటుడుగా శివాజీ నటించారు.
అయితే ఈ సినిమా ఫ్లాప్ కావాలంటే హనీ రోజ్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక తర్వాత 2014లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేక పోయింది. మలయాళం లో మాత్రం మోహన్లాల్, మమ్ముట్టి తదితర స్టార్ హీరోల సరసన నటించింది. ఇక అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాపులర్ అయింది. మోహన్లాల్ నటించిన మాన్ స్టర్ సినిమాల ప్రతినాయకగా నటించిన మంచు లక్ష్మి హనీ రోజ్ లిప్ కిస్ చాలా వైరల్ గా మారింది. ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాతో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది.