సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్లు చాలా ముచ్చటగా ఉంటాయి. మనం ఊహించం కానీ డైరెక్టర్లు సెట్ చేసి మేకర్స్ అభిమానులకు కనులు విందుగా ఎంటర్టైన్మెంట్ ని ఇస్తూ ఉంటారు. అలాంటి కాంబో ఒకటి ఉంది.. వారెవరో కాదు బాలయ్య హనీరోజ్..నందమూరి బాలయ్య ఎంతటి పెద్ద స్టార్ ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మరి అలాంటి ఆయన సినిమాలో అసలు క్రేజీ లేని బ్యూటీ కి అవకాశం ఇస్తారని ఎలా అనుకుంటాం. కానీ బాలయ్య ఇచ్చారు.
ఈ మధ్యనే విడుదలైన వీరసింహారెడ్డి సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..అందులో బాలయ్య సరసన నటించిన హనీరోజ్ ఈ అమ్మడు ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.. ఇప్పుడు ఏ షాప్ ఓపెనింగ్ కి ఈవెంట్స్ కి అయిన హనీరోజే దర్శనమిస్తోంది. అయితే బాలయ్య హనీ కాంబినేషన్లో వారి అభిమానులు మరో సినిమా చూడాలనుకుంటున్నారు. అయితే వారి కోరికను నెరవేర్చబోతున్నాడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావు పూడి
అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇందులో శ్రీ లీల కూతురి పాత్రలో దర్శనమివ్వబోతోంది.. హనీరోజ్ ఇందులో ఒక చిన్న రోల్లో కనిపించబోతోందట.అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్ అని అంటున్నారు.. కానీ సినిమాల్లో మాత్రం భలే నవ్వులు పండిస్తుందని ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నది.. ఇవీళ్ళిద్దరూ కలిసి వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తేనే కెవ్వు కేక పుట్టించారు ఇక రెండో సినిమాలో కూడా నటిస్తే ఏ రేంజ్ లో విజిల్స్ వినిపిస్తాయో చెప్పనవసరం లేదు..