Himaja బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హిమజ(Himaja )కూడా ఒకరు. కానీ అప్పుడప్పుడు బుల్లితెర పైన మాత్రం సందడి చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. సినిమాలలో అంతకుముందు ఈమె బాగానే నటించి పాపులారిటీ అయింది. కానీ బిగ్ బాస్ తో మంచి ఫేమస్ అందుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా హిమజ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.
హిమజ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనను ఎంతోమంది అవమానించారని ఆ అవమానాలను భరించాను కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానని తెలియజేస్తోంది. ముఖ్యంగా తన కళ్ళు సైజు పెద్దవిగా లేవని కొంతమంది డైరెక్టర్లు తనను అవమానించారని తన నడక కూడా మగవారి లాగా ఉందని హేళన చేశారని దీంతో ఈ మాటలు విన్నప్పుడు చాలా ఏడ్చేసానని తెలియజేస్తోంది హిమజ.
ఇక ఈ విషయాలన్నీ విన్న తర్వాత తనలో పట్టుదల మరింత పెరిగిపోయిందని తెలుపుతోంది. మేకప్ వేసుకున్న తర్వాత తన కండ్లు కరెక్ట్ సైజులో కనిపించేవని దాంతో తనను అవమానించిన వారే పిలిచే అవకాశాలు ఇచ్చారని తెలియజేసింది హిమజ. అప్పటినుంచి విమర్శలను అసలు పట్టించుకోవడం మానేశానని సమాజంలో నెగిటివ్, పాజిటివ్ అనేవి రెండు ఉంటాయని మన వాటిని లైట్ గా తీసుకోవాలని చెప్పుకొచ్చింది హిమజ.
సోషల్ వర్క్ చేయడం అంటే చాలా ఇష్టమని ముందుగా తన ఇంట్లోనే సోషల్ వర్క్ మొదలు పెట్టానని తెలియజేసింది. మొదట తన డ్రైవర్ ముగ్గురు పిల్లలను తానే చదివిస్తూ ఉన్నానని తెలియజేసింది. అందుచేతనే నేను చాలా కష్టపడుతూ ఉంటానని కామెంట్లు చేయడం జరిగింది హిమజ. పలు చిత్రాలలో కూడా ఈమె కీలకమైన పాత్రలు నటిస్తూ బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం హిమాజ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.