విశ్వరూపం చూపిస్తోన్న మర్మయోగి ప్రొడ్యూసర్.. పాపం కమల్!

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ స్టార్ హీరో మరియు లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వరూపం 2’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కమల్ స్వయంగా డైరెక్ట్ చేయడంతో ఫస్ట్ పార్ట్‌ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా కమల్‌కు ఏమాత్రం కలిసి రావడంలేదు. మొదటి భాగం తీస్తున్నప్పుడు కూడా ఈ సినిమా చాలా వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు రెండో పార్ట్‌ కూడా ఒక కొత్త వివాదంలో అడుగు పెట్టింది.

తాజాగా ‘విశ్వరూపం 2’ చిత్ర రిలీజ్‌ను నిషేధించాలంటూ చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. సాయిమీరా ప్రొడక్షన్స్ అనే సంస్థ కమల్ తమను మోసం చేసినట్లు వారు ఈ పిటీషన్‌లో పేర్కొన్నారు. కమల్ తమ బ్యానర్‌లో మర్మయోగి చిత్రం చేయడానికి రూ.6.90 కోట్లు డీల్ కుదుర్చుకుని రూ.4 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడట. అయితే మర్మయోగి చిత్రం చేయకుండా కమల్ వేరే సినిమాలు చేస్తున్నాడంటూ వారు ఆరోపించారు. అందుకే తమ డబ్బు తిరిగి ఇచ్చే వరకు కమల్ చిత్రం ‘విశ్వరూపం 2’ను నిషేధించాలని కోర్టును కోరారు.

శుక్రవారం రోజున విచారణ చేపట్టిన హై కోర్టు కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ అయిన ఆస్కార్ ఫిలింస్ వారికి నోటీసులు జారీ చేసింది. తరువాత విచారణను సోమవారానికి వాయిదే వేసింది కోర్టు. మరి విశ్వరూపం 2 అనుకున్న డేట్‌కు రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Share.