స్టార్ హీరో శివ కార్తికేయన్ తాజాగా వరుణ్ డాక్టర్ మూవీతో ఆడియన్స్ ని బాగా అలరించాడు.ఈ యువ హీరో ప్రస్తుతం ఆయలాన్, డాన్ వంటి సినిమాలలో నటిస్తున్నాడు. హీరో గా ఇటు తమిళంలోనూ, తెలుగులో కూడా మంచి అభిమానులను సంపాదించుకున్నాడు. కార్తికేయ నటించిన పలు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా డబ్బింగ్ చేయడం మొదలుపెట్టారు.
వాస్తవానికి మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించాడు శివకార్తికేయన్. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో గా మారిపోయాడు. అయితే తాజాగా తమిళ ఇండస్ట్రీ మొత్తం ఈ యంగ్ హీరో రెమ్యునరేషన్ గురించి హాట్ టాపిక్ గా మారుతోంది. శివ కార్తికేయన్ ఒకో మూవీకి 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకు ఉంటున్నాడట. ఇక తెలుగులో కూడా మొదటిసారిగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో వెండి తెరపై కనిపించిన ఈ హీరో.. త్వరలో కూడా స్ట్రైట్ గా తెలుగులో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనితో మన హీరోలు ఎన్నో సంవత్సరాల నుంచి నటించిన 30 కోట్ల మించి, యువ హీరోలకు దక్కలేదు.