హీరోల మోజులో కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరోయిన్స్ హీరోలను ప్రేమించి తమ కెరియర్ నాశనం చేసుకుంటున్నారనే విషయం గడిచిన ఎన్నో సంవత్సరాలనుంచి వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇందులో కొంతమంది వివాహం చేసుకొని సంతోషంగా ఉంటే మరి కొంతమంది ఇప్పటికీ వివాహం చేసుకోకుండా మిగిలిపోయారు. ముఖ్యంగా హీరోయిన్గా తమ కెరియర్ కొనసాగించేందుకే ఎక్కువ సంవత్సరాలు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. అలా హీరోలతో ప్రేమలో పడి ఎటు కాకుండా ఉన్న హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.

తెలుగు హీరోలను ప్రేమించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్..!!

1). టబు:
హైదరాబాది అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఇంకా వివాహం చేసుకోలేదు. ఈమె అప్పట్లో నాగార్జునతో రిలేషన్ షిప్ లో ఉన్నందువల్లే వివాహం చేసుకోలేదని టాక్.

2) రెజీనా:
టాలీవుడ్ లో మెగా హీరో సాయి ధరంతేజ్తో రెజీనా లవ్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే రెజీనా వైఖరి బాగా లేకపోవడంతో ఏమైనా మెగా ఫ్యామిలీ రిజెక్ట్ చేసిందని వార్తలు కూడా వినిపించాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది కానీ ఈ హీరోతో ప్రేమలో పడి ఏమి కెరీర్ ని నాశనం చేసుకుంటోంది.

3). అనుష్క శెట్టి:
నాగార్జున ,పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమాతో మొదటిసారిగా అనుష్క శెట్టి కెరియర్ ప్రారంభించింది. ఈమె యోగా టీచర్ అయినప్పటికీ ప్రభాస్ తో ప్రికల్లోతుల ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాని ఈ విషయాన్ని వీరిద్దరూ కొట్టి పారేశారు. ఇక గతంలో కూడా పలువురు హీరోలతో ఈమె పైన పలు రూమర్స్ వినిపించాయి.

4). అంజలి:
తమిళ హీరో జై ని ప్రేమించి తన కెరీర్ ని నాశనం చేసుకుంది మొదట జర్నీ సినిమాతో వీరిద్దరి పరిచయం బాగా ఏర్పడి ఆ తర్వాత పలు సినిమాలలో నటించారు దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారని సమాచారం.

Share.