వేశపాత్రలో నటించడం అంటే అది సామాన్య విషయం కాదు. వేశ్యలు నివసించే చోటుకి వెళ్లి వారిని కలిసి వారి లైఫ్ గా అక్కడ జీవన విధానం ఎలా ఉంటుందో గమనించాలి. వేశ్య శరీర భాష ,మాట తీరు ముఖాభి నయం విభిన్నమైన ఎక్స్ప్రెషన్స్ ని పులకించే తీరు ప్రతీది నేర్చుకోవాల్సి ఉంటుంది. గంగుబాయి కతియవాడి చిత్రం కోసం ఆలియా భట్ లైవ్ లో పాఠాలు నేర్చుకుంది. ముంబై రెడ్ లైట్ ఏరియాలో వెళ్లి అక్కడ నేరుగా వేశ్యల నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంది. అయితే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలను సౌత్ లో ఎవరు స్వీకరించారు అన్న విషయానికి వస్తే ఎంతో మంది హీరోయిన్లు సైతం పోషించారు.
అరుంధతి, పంచాక్షరి వంటి చిత్రాలలో అద్భుతమైన నటరాన్ని ప్రదర్శించిన అనుష్క వేదం సినిమాలో వేశ్య పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలోని పాత్ర కోసం కొన్ని లైవ్ సెక్షన్స్ ని కూడా నేర్చుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక బాలకృష్ణ నటించిన పాండురంగడు చిత్రంలో టబు వేశ్యగా నటించింది. అప్పటికే చాందిని బార్ లాంటి చిత్రాలలో వేశగా నటించి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఈమె ఎన్నో సినిమాలలో వేశ్యగా నటించింది.
ఇక తర్వాత హీరోయిన్ ఛార్మి మంత్ర చిత్రంతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.అలాంటి సమయంలోనే పూరి జగన్నాథ్ తో తెరకెక్కించిన జ్యోతిలక్ష్మి సినిమాలో వేశ్యగ నటించింది. హీరోయిన్ శ్రియ కూడా గతంలో పవిత్ర అనే చిత్రంలో వేశ్యగానే నటించింది. నటి సంగీత కూడ విలక్షణమైన డాన్సింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనం అనే చిత్రంలో ఈమె కూడా వేశ్య పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక హీరోయిన్స్ స్నేహ కూడా దూల్ పేట చిత్రంలో వేశ్యగా నటించింది. శృతిహాసన్ కూడా D-DAY అనే బాలీవుడ్ చిత్రంలో వేశ్యగా నటించింది.. ఇక వేరే కాకుండా రమ్యకృష్ణ, అంజలి, జయసుధ జయప్రద తదితరులు సైతం నటించారు.