దగ్గుబాటి రానా భార్య మీహిక బజాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరూ ప్రేమించుకొని మరి పెద్దల సమక్షంలో ఆగస్టు నెలలో 2020లో వివాహం చేసుకున్నారు.. ఇలా వీరి వివాహం తర్వాత ఈ దంపతులు ఎంతో సంతోషంగా గడుపుతున్నప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.. ఇక మీహిక ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.
అయితే ఈమె ప్రెగ్నెంట్ అనే వార్తల పైన ఏ మాత్రం నిజం లేదంటు తెలియజేసింది.ఇకపోతే తాజాగా ఇమే చేసిన పని తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈమె పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.బిజినెస్ ఉమేన్ గా ఎంతో గుర్తింపు సంపాదించిన మీహిక సామాజిక సేవ కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి ముందుకొచ్చింది.. ఈ క్రమంలోనే ఎర్త్ యాంగిల్స్ అని ఎన్జీవో ఆర్గనైజేషన్తో కలిసి ఈమె కొన్ని సామాజిక సేవ కార్యక్రమాలను చేపడుతోంది.. ఈ సంస్థతో కలిసి మారుమూల ఉండే ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలలో పేదవారి కోసం సోలార్ లైట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా కరెంటు లేకుండా మారుమూల గ్రామంలో ఎంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను సైతం ఏమి వెలుగు నింపేలా చేస్తోంది.. ఇలా వారికోసం తన వంతు సహాయం చేస్తున్నటువంటి రానా మిహిక కు సపోర్ట్ చేయడమే కాకుండా అభినందిస్తూ ఉన్నారు.. ఇప్పటివరకు ఇలాంటివి కొంతమంది మాత్రమే చేశారు ఇప్పుడు మీహిక కూడ చేయడంతో అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు..ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram