ఈ నటిని తీవ్రంగా అవమానించిన హీరోయిన్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో కితకితలు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది కమెడియన్ గీతా సింగ్. ఆ తర్వాత పలు చిత్రాలలో కమెడియన్ గానే నటించింది.ఆమెకు ఉన్న భారీ పర్సనాలిటీ వల్ల ఎన్నో విధాలుగా అవమానాలకు గురైంది. ఆమె పట్టుబట్టి మరీ డాన్స్ నేర్చుకొని ఎన్నో ప్రదర్శనలు కూడా చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈమెలోనే మంచి నటిగా గుర్తించిన డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ తన సినిమాలలో ఎక్కువగా ఈమెకు అవకాశాలు ఇస్తూ ఉండేవారట. అలా మొదటిసారి కితకితలు సినిమాలో నటించి 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

Geetha Singh Wiki Bio Age Husband Salary Photos Videos Ig Fb Twఇక ఇందులో అల్లరి నరేష్ ఒక కమర్షియల్ హిట్టుగా నిలిచింది.నరేష్ అప్పటికే హీరోగా దాదాపుగా ఎన్నో చిత్రాలలో నటించారు. కితకితలు మాత్రం అల్లరి నరేష్ కెరీర్లో మర్చిపోలేని సక్సెస్ సినిమా అని చెప్పవచ్చు. ఆ తర్వాత గీతా సింగ్ నటించిన అనేక సినిమాలలో అల్లరి నరేష్ హీరోగా ఉన్న ఆమె కమెడియన్గా కొనసాగింది. అలా ఒకరోజు షూటింగ్ సమయంలో గీతా సింగ్ దారుణంగా కొంతమంది అవమానించారట. ఒక సినిమా షూటింగ్ సమయంలో హీరో నరేష్ కూడా అక్కడే ఉన్నారట..

Actress Geetha Singh Inaugurates Trendz Expo at Taj Krishna Photos - Xappie

రెడీ అవ్వడానికి గీతా సింగ్ క్వార్ వ్యాన్ కి వెళ్ళగా.. అక్కడ ఉన్న హీరోయిన్స్ కొంతమంది ఈవిడ ఏంటి క్వార్ వ్యాన్ ఎక్కుతోంది.. అంటూ అక్కడ ఉన్న కొంతమంది హీరోయిన్స్ ఆమెను హేళన చేశారట. అక్కడే ఉన్న గీతా సింగ్ హెయిర్ డ్రెస్సర్ మాత్రం మేడం ఏంటి అంతలా అవమానిస్తున్న సైలెంట్ గా వెళ్ళిపోతున్నారని గీతాను ప్రశ్నించారట. దీంతో గీత పోనీలే వాళ్లకి మన గురించి తెలియదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయిందట. ఈ విషయం తెలుసుకున్న అల్లరి నరేష్ సరదాగా అందరూ కూర్చున్న సమయంలో గీతానీ పిలిచి.. ఈమె తనని సక్సెస్ఫుల్ హీరోగా చేసిందని నేను నటించిన మంచి విజయం సాధించిన మొదటి సినిమాలో ఈమెనే హీరోయిన్ అంటూ అందరికీ పరిచయం చేశారట .దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలిపింది గీతా సింగ్. ఇక అప్పటినుంచి తనకు మర్యాద ఇచ్చేవారని తెలుపుతోంది.

Share.