సినీ ఇండస్ట్రీలో కానీ మరే ఇతర చోట అయినా కానీ కొన్నిసార్లు ఇతరులు చేసేటువంటి పనుల కారణంగా మరికొంతమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అప్పట్లో పలు తెలుగు చిత్రాలలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ యమునా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే గతంలో అనుకోకుండా వ్యభిచారం నిర్వహిస్తూ హోటల్ గదిలో పోలీసులకు పట్టుబడినట్లుగా వార్తలు వినిపించాయి. దీంతో ఈ ప్రభావం ఈమె కెరియర్ పైన పడిందని చెప్పవచ్చు.
అంతేకాక యమునాకు పలు సినిమా అవకాశాలు కూడా దీంతో దూరం అయ్యాయనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దీంతో అప్పటి నుంచి ఇమే కొంతమేరకు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోందట.తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడిన యమునా తనపై వచ్చినటువంటి ఈ రూమర్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొందరు తనను కావాలని ఈ కేసులో ఇరికించారని దాంతో తనకు తానే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వివరణ ఇచ్చి ముందస్తుబేలు ద్వారా అరెస్టు కాకుండా బయటికి వచ్చారని తెలియజేసింది.
అంతేకాకుండా తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు విచారణలో నిరూపించడం కూడా తేలిందని తెలిపింది.. అయితే ఈ కేసులో తన పేరు రావడంతో కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారని ఆపై తనపై తనకు నమ్మకం నుంచి తన ప్రమేయం లేకుండా ఇరుక్కున్న ఈ కేసు నుంచి బయటపడేందుకు చాలా సహాయపడ్డారని తెలిపింది. ఇక ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని కూడా తెలిపింది కానీ తన స్నేహితురాలు తన బ్రెయిన్‌ను వాష్ చేయడంతో ప్రస్తుతం ఇలా ఉన్నానని తెలిపింది.