టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో పేరు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత అంతకుమించిన సినిమాలను కూడా చేశాడు. ఇంకా చెప్పాలంటే తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాసే అనే చెప్పవచ్చు.. తాజాగా హీరోయిన్ కృతిసనన్ తో ప్రభాస్ లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కృతిసనన్, ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రల్లో నటించగా కృతి సనన్ సీతగా కనిపించనుంది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకిరూ.500 కోట్ల బడ్జెట్ తో త్రీడీలో తెరకక్కనుంది.
ఇక ఈ సినిమా జూన్ 16న రిలీజ్ చేస్తారని గతంలోనే ప్రకటించారు. అసలు విషయంలోకి వెళ్తే..ప్రభాస్ – కృతిసనన్ మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా వస్తున్న ఈ రూమర్స్ పై అటు ప్రభాస్ టీమ్ ఇటు కృతి సన్నిహితులు స్నేహితులు మీడియాకి క్లారిటీ ఇచ్చారు. ఎవరో ఏదో ఊహించుకొని అభిమానుల దృష్టికి తీసుకువెళుతున్నారు అంటూ వారు వాపోతున్నారు. దీనిపై స్వయంగా స్పందించిన కృతి సనన్ తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక పోస్ట్ చేశారు. ఆ వీడియో అమెరికన్ టాక్ షో హోస్ట్ నటి అయిన ఓఫ్రా కు చెందిన వీడియో కావటం విశేషం
.
అందులో ఒక పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో అలాగే ప్రజలు కూడా స్పందించాలనుకోవడం వల్ల మీకు నిరాశ మిగులుతుంది. అంటూ అందులో ఓఫ్రా చెప్తుంది.అంటే వారిద్దరిపై వచ్చే రూమర్స్ ఆగకపోవటంతో ఈ పోస్టును చేసింది. మా ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు లేవని కృతి సనన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా.. ఈ రూమర్స్ ఆగటం లేదు. అంటూ వాపోయింది.