టాలీవుడ్ హీరోయిన్ కలర్ స్వాతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఇక ఇమే వివాహం చేసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు.. అలాగే తన భర్త వికాస్ తో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లోనే ఒకసారి స్వాతి ఈ విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.. స్వాతి తన భర్త నుంచి డైవర్స్ కోసం కోర్టులో అప్లై చేసిందని వార్తలు కూడా తాజాగా వినిపిస్తూ ఉన్నాయి.
దీంతో స్వాతి ఈ రూమర్స్ పైన స్పందించలేదు..అయితే ఈ విషయంపై ఒక మీడియా సంస్థ స్వాతిని సంప్రదించగా నేను చెప్పడానికి ఏమీ లేదు అలాంటివి ఏదైనా ఉంటే కచ్చితంగా నేను చెబుతాను అంటూ 2020లో కూడా ఇలాగే ఫొటోస్ డిలీట్ చేసినప్పుడు ఇలాంటి రూమర్లే ఎక్కువగా వినిపించాయి.. ఫోటోలను ఆక్వేర్ లో దాచి పెట్టానని తెలియజేసింది స్వాతి. దీంతో స్వాతి దంపతులపై వస్తున్న మీడియా వార్తలు కేవలం వట్టి రూమర్లే అంటూ ఈమె క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక స్వాతి కెరియర్ విషయానికి వస్తే కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి దీనినే తన ఇంటి పేరుగా మార్చుకొని ఆ తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నది.. ముఖ్యంగా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె స్వామి రారా,సుబ్రహ్మణ్యపురం అష్టాచెమ్మా ,గోల్కొండ హై స్కూల్ ,కార్తికేయ తదితర చిత్రాలలో నటించింది.
స్వాతి నటన పరంగా కాకుండా వాయిస్ తో కూడా చాలామంది అభిమానులను సంపాదించుకుంది.అందుకే పలువురు హీరోయిన్లకు ఈమె గొంతును అరువుగా ఇస్తోందని తెలుస్తోంది. మరి స్వాతి తన భర్త పైన వస్తున్న రూమర్లు ఈ విషయంతోనైనా ఆగిపోతాయేమో చూడాలి మరి.
View this post on Instagram