టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్కార్ రేసులో నాటు నాటు పాట నిలబడి అకాడమీ అవార్డు అందుకుంది. సింగర్స్ విషయానికి వస్తే రాహుల్ సింప్లిగంజ్ మాత్రమే కాకుండా కాలభైరవ పెర్ఫార్మషన్స్ కూడా అక్కడున్న ప్రజలంతా కేక అన్నారు.
కొంతమంది హీరోలు అక్కడే స్క్రీన్ మీద ఎంతో పోటీపడి డాన్సులు చేశారు. బ్యాగ్రౌండ్ లో ఇద్దరూ యంగ్ సింగర్స్ కూడా తమ స్టామినని అదే రేంజ్ లో చూపించి ప్రశంశాల వర్షం అందుకున్నారు. ప్రపంచం మొత్తం రాజమౌళి పైనే RRR దీనిపైన ప్రశంసలు కురిపించడం జరిగింది .తాజాగా ఈ సినిమాలో నటించిన శ్రియ కూడా రాజమౌళి పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్ లోని అనుభవాలను కూడా షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. శ్రియ మాట్లాడుతూ..RRR సినిమాలోని పాత్ర కోసం నన్ను పిలవగానే నేను ఓకే చెప్పాను అందుకు కారణం రాజమౌళి ఈ సినిమాలో మీది చిన్న పాత్ర అయినా చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పగానే నేను ఓకే చేశానని తెలిపింది.
నేను సేట్టుకు వెళ్ళినప్పుడు అది మొత్తం విలేజ్ సెట్ అప్ లో ఉంది. సినిమాలో నా కొడుకుని చంపేస్తారు నేను వెనక్కి తిరగగానే నన్ను కూడా కాల్చేస్తారు నేను చనిపోవాలి ఆ సమయంలోనే నా కళ్ళల్లో బాధ నిస్సహాయత కనిపించాలి.. ఆ సీను రాజమౌళి నాకు వివరించేటప్పుడే అర్థమయింది. ఆ సీన్లు ఎంత డెప్త్ ఉందో అలాగే ఆయన చెప్పినట్టే ఆ సీనులో నటించాను ఆసిన్ అద్భుతంగా వచ్చిందని తెలుపుతోంది శ్రియ. రాజమౌళితో రెండు సినిమాలలో పనిచేశాను 2005లో చత్రపతి సినిమాలో నటించాను. ఇప్పుడు RRR చిత్రంలో ఆయనలు ఎలాంటి మార్పు లేదు. ఆయన డెడికేషన్ మామూలుగా ఉండదు ఒక సన్నివేశం షూట్ చేయాలి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ తో ఆ సీన్పై ఎన్నోసార్లు పనిచేస్తారు మార్నింగ్ షూటింగ్ కు రాగానే తనకు ఏం కావాలో ఎలా కావాలో చేసి చూపించి మరి చేయించుకుంటారని తెలుపుతోంది.