టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన సమంత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గత కొద్దిరోజులుగా సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలియజేయడంతో అందరూ కూడా సమంత త్వరగా కోలుకోవాలని అభిమానుల సైతం కోరుకున్నారు. ఇక గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత సినిమా బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత మయో సైంటిస్ట్ వ్యాధి బారిన పడడంతో నడవడం నిల్చడం వంటివి అసలు చేయలేక చాలా కష్టం మౌతొంది అంటూ తెలియజేసింది.
సమంత తాజాగా మరొక ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే సమంత రియల్ లైఫ్ లో కూడా ఒక ఫైటర్ అని చెప్పవచ్చు ఎందుకంటే హీరోయిన్లు అనగానే గ్లామర్ రూల్స్ మాత్రమే కాకుండా ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కెరియర్ ప్రారంభంలో అలాంటి పాత్రలో నటించిన సమంత ఆ తర్వాత.. ది ఫ్యామిలీ మ్యాన్ -2 సిరిస్ లో ఓటీటి లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.రాజి అనే క్యారెక్టర్లు ఈమె అద్భుతమైన ఫైటర్గా నటించింది.
సమంత లీడ్ రోల్ పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమా షూటింగ్లో కూడా త్వరలోనే పాల్గొనబోతోంది. అలాగే హాలీవుడ్లో సీటడెల్ చిత్రంలో కూడా నటిస్తోంది. షూటింగ్లో భాగంగానే గాయపడినట్లుగా సమంత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఇందులో తన చేతులకు గాయాలైనట్టుగా ఉండడం చూసి సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
View this post on Instagram