ఒకప్పుడు హీరోయిన్గా తన అంద చందాలతో కుర్ర కారులను మెప్పించింది హీరోయిన్ రాశి.. ఎన్నో చిత్రాలలో ఈమె అచ్చ తెలుగు అమ్మాయిగా.. చీర కట్టులో ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది రాశి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించి మెప్పించింది. వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది రాశి .ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం.
ఈమెకు ఒక కూతురు కూడా ఉన్నది.. రాశి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా పలు రకాల ఇంటర్వ్యూలకు ఇస్తూ పాపులారిటీ సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి కి ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ మీద పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది..క్యాస్టింగ్ కౌచ్ గురించి రాశి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదని నేను అసలు చెప్పలేను.. కేవలం సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో కూడా ఇది ఉన్నది.
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలని నాకు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సరే..క్యాస్టింగ్ కౌచ్ భారికి గురయ్యాను కెరియర్ మొదట్లో ఒక తమిళ సినిమాకు కమిట్ అయ్యాను..కానీ ఆ సినిమా నిర్మాత షూటింగ్ సమయంలో తనతో మిస్ బిహేవ్ చేశారని తెలియజేసింది. కానీ నేను వాటిని పట్టించుకోలేదని అయితే మేనేజర్ తన వద్దకు వచ్చి మీరు ఒకసారి సార్ రూమ్ కి వెళ్ళాలి అంటూ తెలియజేశారట.. మీతో సినిమా గురించి మాట్లాడుతారని చెప్పారట ఆ మేనేజర్..
దీంతో రాశికి అనుమానం వచ్చి నేను ఆయన రూమ్ కి వెళ్లలేదని తెలిపింది. ఆ తర్వాత రోజు నిర్మాత ఇదే విషయంపైన ప్రశ్నిస్తే నాకు తెలియకుండా ఇదంతా జరిగింది సారీ అంటూ తెలియజేయడంతో వదిలేసానని తెలియజేసింది రాశి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది రాశి.