టాలీవుడ్ లో వి.కే.నరేష్ కు ఎంతో మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ పేరును ఆయనే పోగొట్టుకున్నాడు. నటుడు నరేష్ సోషల్ మీడియాలో ఆయన మూడో పెళ్లికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో అందరికీ తెలిసిందే .వీరిద్దరి వ్యవహారంలో ఇప్పటికే ఎన్నో రకాల కథనాలు వినిపించిన సంగతి తెలిసిందే.తరచూ ఈ జంట ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉన్నారు.
ఇక వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వివాహం చేసుకుని ఒక్కటి కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు నిజం కాదంటూ గతంలో తెలియజేశారు.. కానీ ఈ జంట న్యూ ఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియోలు పోస్ట్ చేశారు. ఆ పోస్టును చూసిన వారందరూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా వారు చేసే పనులను చూసి ఆ లిప్ లాక్ ఫోటోలను చూసి ఈ వీడియోల పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే వీరిద్దరి వ్యవహారం పై తాజాగా ప్రముఖ నటి పూజిత కొన్ని వ్యాఖ్యలను చేసింది.
గతంలో నరేష్ సరసన పలు సినిమాల్లో నటించింది పూజిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజిత నరేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. పూజితకు ఒక్కసారి హెల్ప్ కావాల్సి వస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ కోసం వెళ్లాలని అప్పుడు ఏ ఒక్కరూ సహాయం చేయలేదని ఆ సమయంలో నరేష్ మాత్రమే తనకు హెల్ప్ చేశాడని పూజిత చెప్పుకొచ్చింది. నరేష్ మంచి మనసు గల వ్యక్తి..అలాగె మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది. అలా అంటూనే చివర్లో ఆయన ఒక శని గ్రహాన్ని నెత్తిమీద పెట్టుకున్నాడు. అదొక్కటే నరేష్ చేసిన తప్పు నరేష్ మంచి మనిషి అంటూనే పవిత్ర లోకేష్ ని శని గ్రహం అనేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇమే చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.