తెలుగులో పలుసినిమాలలో నటించిన సీనియర్ హీరోయిన్ కళ్యాణి గురించి చెప్పాల్సిన పనిలేదు.. తన భర్త సూర్య కిరణ్ కూడ సినీ డైరెక్టర్.. అయితే వీరిద్దరూ ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది..ఈ మధ్యనే సూర్య కిరణ్ చెల్లెలు బుల్లితెర నటి సుజిత వారిద్దరి విడాకుల గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.. అదేంటంటే వారిద్దరి మధ్య విభేదాలు రావడానికి ఆర్థిక కష్టాలే కారణమని డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని ఆమె స్పష్టం చేసింది. కానీ వీరి విడాకులకు మరో కారణం ఉందని ఆ కారణం కూడా ఒక స్టార్ హీరో అని ఒకప్పుడు వార్తలు వినిపించాయి
అదేంటంటే కళ్యాణి విడాకులు తీసుకున్నప్పుడు ఓ స్టార్ హీరోతో కళ్యాణి ఎఫైర్ పెట్టుకోవడం వల్లే సూర్యకిరణ్, కళ్యాణ్ కి మధ్య విభేదాలు వచ్చాయని ఫలితంగా వీరిద్దరు విడిపోవాల్సి వచ్చిందని వార్తలు వినిపించాయి. మరి ఇంతకు ఆ స్టార్ హీరోఎవరో కాదు జగపతిబాబు వీరిద్దరి కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చాయి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ కు మంచి పేరు కూడా ఉన్నది.
అయితే పెళ్లి కాకముందే కళ్యాణి, జగపతిబాబు మంచి స్నేహితులు కానీ వీరి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు వచ్చేసరికి ఇండస్ట్రీలో వీరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తోందని అనుకున్నారు. ఈ విషయం కళ్యాణి భర్త చెవిలో పడింది. అయితే పెళ్లికాకముందు అంటే ఎవరూ పట్టించుకోకపోవచ్చు.. కానీ పెళ్లయ్యాక కూడా ఈ వార్త వినిపించేసరికి సూర్యకిరణ్ గొడవ పెట్టుకున్నాడట..
అయితే కళ్యాణి కూడా అలాంటిదేమీ లేదు అని సర్ది చెప్పినప్పటికీ సూర్యకిరణ్ తరచూ ఈ విషయాన్ని ప్రస్తావించేసరికి కళ్యాణికి విసుగు వచ్చి తన భర్తకు విడాకులు ఇచ్చేసిందట..అంతేకాకుండా వీరిద్దరి దంపతులు విడిపోవడానికి కారణం జగపతిబాబు అంటూ అప్పట్లో ఈ విషయాన్ని చాల వార్తలు వినిపిస్తూ ఉండేది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.