టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటి అసిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. నాగార్జునతో శివమణి ,రవితేజతో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఇలా అప్పట్లో అగ్ర హీరోలతో నటించి ఎంతో పేరును సంపాదించుకుంది. ఒక తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి పేరును సంపాదించుకొని ఎన్నో సక్సెస్ సినిమాలను అందుకుంది.
ఆ తరువాత 2016లో మైక్రోమ్యాక్స్ కంపెనీ సీఈఓ రాహుల్ శర్మాని వివాహం చేసుకుంది. అయితే వీరి వివాహం అప్పట్లో ఘనంగా జరిగింది. వీరికి ఒక పాప ఉంది వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా సాగుతున్న సమయంలో వీరి గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. కానీ ఇప్పుడు వీరి వైవాహిక జీవితం గురించి ఒక వార్త సోషల్ మీడియా వైరల్ గా మారుతోంది.
అదేమిటంటే అసిన్, రాహుల్ శర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఒక వార్త రెండు రోజులుగా వైరల్ గా మారుతూనే ఉంది. అయితే గతంలో కూడా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.. కానీ అసిన్ ఈ విషయాన్ని తెలుసుకొని వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అక్కడితో ఆ మేటర్ కి పులిస్టాప్ పడేలా చేసింది. ఇప్పుడు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారనీ ఇప్పటికీ కూడా ఆసీన్ తన భర్త వేరువేరుగా ఉంటున్నారని సమాచారం.
అయితే ఇప్పుడు అసిన్ తన భర్త ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనే విషయంలోకి వస్తే రాహుల్ కి మరో అమ్మాయితో సంబంధం ఉందని ఈ విషయం తెలుసుకున్న టువంటి అసిన్ తన భర్తకు రెండు మూడు సార్లు వార్నింగ్ కూడా ఇచ్చిందట. అయినా తను వినకపోవడంతో తనకి ఒక కూతురు ఉన్నా కూడా ఆలోచించకుండావెంటనే విడాకులు తీసుకోవడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి..అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలి అంటే ఈ విషయం పైన ఆసిన్ స్పందించాల్సి ఉంటుంది.