తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అంజలి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అంజలి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట నటించిన ఫోటో, షాపింగ్ మాల్ చిత్రంతో బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత జర్నీ చిత్రంతో మరింత పాపులర్ అయింది. ఇక శ్రీకాంత్ అద్దాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళిపోయింది అంజలి. అయితే ఆ తర్వాత తన కెరియర్లో కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక వచ్చిన అవకాశాన్ని ఒకే చెప్పడంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా పతనమైంది. తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య కాలంలో కాస్త గ్లామర్ గా నటించడానికి కూడా ఓకే చెప్పేస్తోంది.

Where is Heroine Anjali?

దీంతో అభిమానులు ఈమెను ఇదే తరహాలో చూడలేకపోతున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది అంజలి. కోలీవుడ్ లో కూడా పరవాలేదు అనిపించుకున్న ఈ మధ్యకాలంలో పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. అంజలి కెరియర్ లో కొన్ని వివాదాస్పందమైన సంఘటనలు చిక్కుకోవడం వల్ల ప్రస్తుతం హైదరాబాదులో మఖం మార్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటిస్తూ మైమరిపిస్తోంది అంజలి. ఆ మధ్య ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన అంజలి నటుడు జై నీ వివాహం చేసుకోబోతోంది అంటూ ప్రచారం కూడా జరిగింది.

Heroine Anjali: నాకు ఆ మూడ్ లేదు.. ఇప్పుడే పెళ్లి చేసుకునేది లేదు!– News18  Telugu

అయితే ఇప్పటివరకు తన పెళ్లి విషయంపై ఎక్కడా స్పందించలేదు. ఇప్పుడు తాజాగా వెబ్ సిరీస్ ఫాల్ లో నటించిన అంజలి ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి రావడంతో అక్కడ మీడియాతో ముచ్చటించడం జరిగింది. ప్రేమ, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ సమాధానం ఇస్తూ ఇదివరకే వివాహమైందని అమెరికాలో నివాసముంటున్నట్లు ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపించాయి. అయితే ఇందులో వాస్తవానికి నిజం లేదు. ఇవన్నీ కేవలం ఒట్టి పుకార్లే అని తెలియజేసింది.

ప్రస్తుతానికి తనకి పెళ్లి చేసుకొనే ఆలోచన అయితే లేదని ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని తెలియజేసింది. వివాహమైతే కచ్చితంగా చేసుకుంటానని ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అందరికీ తెలియజేసే చేసుకుంటానని అంజలి తెలియజేసింది. అంజలి అభిమానుల సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.

Share.