యాక్షన్ హీరో విజయ్ కాంత్ వీడియో వైరల్, కన్నీరుపెట్టిన ఫ్యాన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. గతంలో విజయ్ కాంత్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి కూడా అనువాదం చేసి ఇక్కడ విడుదల చేసారు నిర్మాతలు. అలా మన తెలుగు ప్రేక్షకులకి కూడా విజయ్ కాంత్ దగ్గరయ్యారు. సాధారణముగా చూడటానికి మంచి శరీర సౌష్టవంతో, కండలు తిరిగిన దేహం తో ఉండే వారు విజయ్ కాంత్, భారీ స్టాంట్స్ కి ఫైట్స్ కి విజయకాంత్ పెట్టింది పేరు. సినిమాల్లో కొంత విరామం తీసుకుని, సొంతంగా డీ ఎం డీ కే పార్టీ కూడా స్థాపించారు.

అయితే కొద్దీ రోజుల క్రితం విజయకాంత్ ఆరోగ్య కారణాల రీత్యా ఆసుపత్రి లో చేరారు. ఇక తాజాగా అయన కరుణానిధి సమాధి కి నివాళులు అర్పించటానికి వచ్చిన సందర్భంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో లో విజయకాంత్ సతీమణి మరియు మరో మనిషి సహాయం ఉంటే కానీ నడవలేని స్థితిలో ఉన్నారు ఈ యాక్షన్ హీరో. అతని పరిస్థితి చూసి అక్కడి ప్రజలు, మరియు అతని అభిమానులు ఆశ్చర్య పోయారు. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Share.